దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అశ్లీల వీడియోల అంశంపై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు
- దేవెగౌడ కుమారుడు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్
- ప్రజ్వల్ కు డబ్బు, పలుకుబడి ఉన్నాయన్న పూనం కౌర్
- ఈ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేదని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని దేవెగౌడ పార్టీ జేడీఎస్ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ వ్యవహారం ఆ కూటమిపై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ జర్మనీకి పారిపోయారని ఆమె తెలిపింది. ఆయనకు ఎంతో డబ్బు, పలుకుబడి వున్నాయని... అందుకే ఈ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన సేఫ్ గా జర్మనీకి వెళ్లిపోయారని చెప్పారు.