Satya: సత్య నుంచి ఈ ‘మౌనరాగం’ లిరికల్ సాంగ్ విడుదల

Ee Mouna Raagam Lyric Video Released From Satya Movie
షార్ట్స్‌లో చూడండి
సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల స్థాపించిన ‘శివమ్ మీడియా’ నుంచి వస్తున్న తొలి సినిమా సత్య. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఈ మౌనరాగం.. నిను పిలిచిన తరుణం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. స్కూల్ బ్యాక్‌గ్రౌండ్‌లో దీనిని రూపొందించారు. వినగానే మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

సత్య మూవీని శివ మల్లాల నిర్మించగా.. రచన, దర్శకత్వం వాలీమోహన్. అమరేశ్, ప్రతర్నా సందీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. కేఎన్ విజయ్‌కుమార్ మాటలు అందించగా, కేఎస్ సుందరమూర్తి సంగీత దర్శకత్వం వహించారు. గోసాల రాంబాబు పాటలకు సుందరమూర్తి అద్భుతమైన బాణీలు సమకూర్చారు.  
Go Back to Shorts
Satya
Tollywood
Satya Movie
Shivam Media
Amaresh
Pratharna Sandeep
Wali Mohan Das
Shiva Mallala

More Telugu News