Pemmasani: ఇండిపెండెంట్లకు, కొందరు రెడ్డి సోదరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నారు: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

Jansena Glass symbol being allotted to independents says Pemmasani
  • గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్
  • జనసేన పోటీ చేయని స్థానాల్లో గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయిస్తున్నారని మండిపాటు
  • కూటమికి 125 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో మునిగితేలుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్ వాసులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ... జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును... ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు, కొందరు రెడ్డి సోదరులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. గాజు గ్లాసును ఇతరులకు కేటాయించవద్దని ముందుగానే ఎన్నికల అధికారులకు విన్నవించామని... అయినప్పటికీ అధికారులు ఆ గుర్తును ఇతరులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా కూటమి విజయం తథ్యమని అన్నారు. 125 నుంచి 150 అసెంబ్లీ... 17 నుంచి 23 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Pemmasani
Telugudesam
Janasena
Glass Symbol

More Telugu News