Brother Anil Kumar: పాపాలు చేసిన వారిని తొక్కి పడేయండి: బ్రదర్ అనిల్ కుమార్ పిలుపు

Brother Anil Kumar held meeting in Kadapa
  • కడపలోని కృపా చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం
  • తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వెల్లడి
  • ఎవరికీ భయపడొడద్దని, ఏసుప్రభువు అండగా ఉన్నాడని వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో రాజారెడ్డి వీధిలోని కృపా చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ ఇవాళ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు.  పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి అని పిలుపునిచ్చారు. పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదు... ధైర్యంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. ఎవరికీ భయపడకండి... ఏసుప్రభువు అండగా ఉన్నాడు అని బ్రదర్ అనిల్ ఉద్బోధించారు. దేవునిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News