Narendra Modi: ఆ పాపాలను కొనసాగిస్తున్న కాంగ్రెస్​ యువరాజు.. రాహుల్​ పై మోదీ ధ్వజం

Rahul insulted maharajas but silent on atrocities by nawabs pm attack
  • రాజులు, మహారాజులను అవమానిస్తూ వచ్చిన రాహుల్‌.. నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారు
  • బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటమని మండిపాటు
  • కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని.. కాంగ్రెస్‌ యువరాజు ఆ పాపాలను నేటికీ కొనసాగిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్ గాంధీ.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మాత్రం ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

వారి దౌర్జన్యాలపై నోరు మెదపలేదేం?
గతంలో దేశంలో రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ గాంధీ ఆరోపించారని.. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చన్నమ్మ వంటి వారిని కూడా అవమానించారని విమర్శించారు. ఓ వర్గం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అలా మాట్లాడారని ఆరోపించారు. అదే మొఘల్‌ చక్రవర్తి ఔరంగ జేబు పాల్పడిన దారుణాలు, దేవాలయాలను కూల్చివేసిన విషయం గురించి రాహుల్‌ మరచిపోయారా అని ప్రశ్నించారు.
Narendra Modi
Rahul Gandhi
Congress
Lok Sabha

More Telugu News