బీజేపీ నేతల పదేళ్ల అబద్ధాల తర్వాత ఇదీ పరిస్థితి.. అఖిలేశ్ యాదవ్ షేర్ చేసిన వైరల్ వీడియో ఇదిగో!
- తొలి రెండు విడతల్లో బీజేపీకి ఓటర్లు దూరమయ్యారన్న అఖిలేశ్ యాదవ్
- మున్ముందు ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉండబోతోందని వ్యాఖ్య
- ఆ పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా దొరకడం లేదని ఎద్దేవా
నిన్న 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ బాగా బలహీనపడిందని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఓ వార్తా చానల్ రిపోర్టర్ బీజేపీ బూత్ ఏజెంట్‌తో మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను అఖిలేశ్ షేర్ చేశారు. ‘బీజేపీ నేతల పదేళ్ల అబద్ధాల తర్వాత.. ఆ పార్టీ బూత్ ఏజెంట్ పరిస్థితి ఇదీ’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటి కారణంగానే ప్రజలకు బీజేపీకి ఓటేయలేదని విమర్శించారు.