పోక్సో కేసులపై ఒరిస్సా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- సగం కేసులు కక్షసాధింపు లక్ష్యంతోనే పెడుతున్నారన్న కోర్టు
- చార్జిషీట్ నమోదయ్యాక కక్షిదారులు పెళ్లి చేసుకుంటున్నారని వెల్లడి
- కేసు కొట్టేయాలని న్యాయస్థానం ముందుకు వస్తున్నారని వివరణ
ఇటీవల నమోదైన పోక్సో కేసులను విచారిస్తూ.. దాదాపు సగం కేసులలో తప్పుడు ఆరోపణలు, కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులేనని ఒరిస్సా హైకోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ల ప్రేమను, వారి సాన్నిహిత్యాన్ని సహించలేక పేరెంట్స్ ఈ కేసులు పెడుతున్నారని జస్టిస్ సిబో శంకర్ మిశ్రా పేర్కొన్నారు. బాధితుల మైనారిటీ తీరగానే వారు వివాహం చేసుకుని కోర్టును ఆశ్రయిస్తున్నారని, తమపై నమోదైన పోక్సో కేసును కొట్టేయాలంటూ అర్థిస్తున్నారని చెప్పారు. తాజాగా విచారిస్తున్న నాలుగు కేసులను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదు కేసుల్లోనూ నాలుగు కేసులు వివాహ బంధంతోనే ముగిశాయని చెప్పారు.