Raghunandan Rao: రేవంత్ రెడ్డి, హరీశ్ రావు విమానంలో చర్చలు జరిపారు.. కేటీఆర్ ఆయన డ్రామాలు గమనించడం లేదు: రఘునందన్ రావు

Raghunandan Rao fires at revanth reddy and harish rao
  • నేను కొట్టినట్లు చేస్తా... నువ్వు ఏడ్చినట్లు చెయ్ అని మాట్లాడుకున్నారన్న రఘునందన్ రావు
  • రానున్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను మీడియాలోకి రాకుండా చేసి హరీశ్ రావు కొత్త పార్టీ పెడతారని ఆరోపణ
  • మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలు పెట్టారన్న బీజేపీ నేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమానంలోనే చర్చలు జరిపారని... తన బావ ఆడుతున్న డ్రామాలను కేటీఆర్ గమనించడం లేదని మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను మీడియాలోకి రాకుండా చేసి హరీశ్ రావు కొత్త పార్టీ పెడతారని సంచలన ఆరోపణలు చేశారు. మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలు పెట్టారన్నారు.

మార్చి 19న విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే వారిద్దరు మాట్లాడుకున్నారన్నారు. నేను కొట్టినట్లు చేస్తా... నువ్వు ఏడ్చినట్లు చెయ్ అని ఇద్దరూ మాట్లాడుకున్నారని విమర్శించారు. హరీశ్ రావు మాటలకు తప్ప చేతలకు పనికి రాడన్నారు. పదేళ్లలో కనీసం రూ.1 లక్ష రుణమాఫీ చేయనందుకు హరీశ్ రావు గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. మీడియాలో హైలైట్ కావడం కోసమే ఆయన మాటలు చెబుతున్నారన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు.
Raghunandan Rao
Telangana
BJP
Lok Sabha Polls

More Telugu News