ఏడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నా.. మథుర బీజేపీ లోక్‌సభ అభ్యర్థి హేమమాలిని ధీమా
- కార్యకర్తలు బాగా పనిచేశారని కితాబునిచ్చిన హేమ మాలిని
- నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానన్న బీజేపీ నాయకురాలు
- యూపీలో ఆర్ఎల్డీతో పొత్తు మరిన్ని ఓట్లను సంపాదించి పెడుతుందన్న హేమ మాలిని
మథురకు తాను ఎంతో సేవ చేశానని, కాబట్టి ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు బాగా పనిచేశారని, విజయంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు మిమ్మల్ని గెలిపిస్తాయా? లేదంటే, ‘మోదీ-యోగి ఫ్యాక్టర్’ పనిచేస్తుందా? అన్న ప్రశ్నకు ‘అన్నీ’ అని సమాధానం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు మరిన్ని ఓట్లను సంపాదించి పెడుతుందని తెలిపారు. కాగా, మథురలో హేమమాలినిని కాంగ్రెస్ నేత ముకేశ్ దంగర్ ఎదుర్కొంటున్నారు.