Road Accident: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Fatal road accident in Kodada and Six people killed
  • ఆగివున్న లారీని ఢీకొన్న కారు
  • ప్రమాదంలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమం
  • గురువారం తెల్లవారుజామున 65వ రహదారిపై ప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడ శివారు దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. 65వ నంబర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతోందని చెప్పారు.

కాగా కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అతివేగం, డ్రైవర్‌కు నిద్రలేమి ప్రమాదానికి కారణాలుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

  • Loading...

More Telugu News