Sachin Tendulkar: స‌చిన్ బ‌ర్త్‌డే.. ఐసీసీ స్పెష‌ల్ వీడియోపై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు!

ICC Shares Special Video on Sachin Tendulkar 51st Birthday
  • నేడు సచిన్ టెండూల్కర్ 51వ పుట్టిన‌రోజు
  • ఆయ‌న‌కు ఐసీసీ 'ఎక్స్' వేదిగా ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్‌
  • ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన వీడియోకు అద్భుత‌మైన స్పంద‌న‌
భార‌త క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ 51వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఓ వీడియో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుత బౌల‌ర్ల‌ను ఆయ‌న ఎదుర్కొంటే ఎలాంటి షాట్స్ ఆడేవారో తెలిపేలా ఐసీసీ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. 

ప్యాట్ క‌మిన్స్‌, క‌సిగో ర‌బాడ‌, ముస్తాఫిజుర్‌, జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో స‌చిన్ బౌండ‌రీలు బాదిన‌ట్లు వీడియోను రూపొందించింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఎడిటింగ్ అద్భుతంగా ఉందంటూ ఐసీసీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కూడా 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిగా సచిన్‌కు ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.
Sachin Tendulkar
ICC
Birthday
Cricket
Sports News

More Telugu News