Gujarat: రేపు బండి సంజయ్ నామినేషన్... తెలంగాణకు రానున్న గుజరాత్ ముఖ్యమంత్రి

Gujarat CM to lead BJP campaign in Telangana on April 25
  • రేపు తెలుగు రాష్ట్రాలలో భూపేంద్ర పటేల్ ఎన్నికల ప్రచారం
  • తెలంగాణ, ఏపీలలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం
  • మధ్యాహ్నం కర్నూలులో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న గుజరాత్ సీఎం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు గురువారం తెలంగాణకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా, ఆయన మొదట కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు.

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో భరత్ ప్రసాద్‌కు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో రోజంతా ప్రచారం నిర్వహిస్తారు సాయంత్రం గుజరాత్ చేరుకుంటారు.
Gujarat
Telangana
Congress
BJP
Andhra Pradesh

More Telugu News