KCR: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం... కాన్వాయ్‌లోని 10 వాహనాలు ఒకదానికొకటి ఢీ

BRS chief KCR convoy cars meet with accident
  • నల్గొండ జిల్లాలోని వేములపల్లి శివారులో ఒకదానికొకటి ఢీకొన్న కార్లు
  • దెబ్బతిన్న ఎనిమిది నుంచి పది వాహనాలు 
  • ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న నాయకులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన వాహనంలోని ఎనిమిది నుంచి పది వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దాదాపు అన్ని కార్ల బ్యానెట్లు దెబ్బతిన్నాయి. ఓ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News