పూర్తిగా మహిళల కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం: చంద్రబాబు
- శ్రీకాకుళంలో మహిళా శక్తి సభ
- హాజరైన చంద్రబాబు
- అవకాశాలు ఇస్తే మహిళలు రాణిస్తారన్న చంద్రబాబు
"నేడు శ్రీకాకుళంలో 'మహిళా శక్తి'తో ముఖాముఖి మాట్లాడాను. ఈ సభ ప్రత్యేకత ఏంటో తెలుసా...? ఈ సభకు పూర్తిగా మహిళలే హాజరయ్యేలా, మహిళల కోసమే ఏర్పాటు చేశాం. మహిళలకు అవకాశాలు ఇస్తే రాణిస్తారని నేను గట్టిగా నమ్ముతాను. రాజకీయ ప్రక్రియల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించడంపై రాజకీయ పార్టీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారి సమస్యలు పంచుకునేందుకు, వారి అవసరాలపై భరోసా ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి" అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
