Pat Cummins: ప్యాట్ క‌మిన్స్ నోట తెలుగు మాస్ డైలాగ్స్.. వీడియో వైర‌ల్‌!

Pat Cummins Speaks Telegu in Star Sports Promo for SRH vs RCB IPL 2024 Clash
  • ఒక్క‌సారి క‌మిటైతే నామాట నేనే విన‌ను అంటున్న ఎస్ఆర్‌హెచ్ సార‌ధి
  • 'క‌మిన్స్ అంటే క్లాస్ కాదు మాస్‌, ఊర మాస్' అంటూ స‌రైనోడు మూవీ డైలాగ్ చెప్పిన ఆసీస్ క్రికెట‌ర్‌
  • 'ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ పుష్ప డైలాగ్‌తో ఫ్యాన్స్‌ను అల‌రించిన ప్యాట్ క‌మిన్స్‌
స‌న్‌రైజ‌ర్స్ మాజీ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ గ‌తంలో తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి తెలుగువారంద‌రికీ ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ సార‌ధి ప్యాట్ క‌మిన్స్ వంతు వ‌చ్చింది. ప్యాట్ క‌మిన్స్ నోట తెలుగు మాస్ డైలాగ్స్ భ‌లేగా కుదిరాయి. 'ఒక్క‌సారి క‌మిటైతే నామాట నేనే విన‌ను', 'క‌మిన్స్ అంటే క్లాస్ కాదు మాస్‌, ఊర మాస్‌', 'ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ ఆయ‌న చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌ను అల‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌మిన్స్ తెలుగు డైలాగ్స్ తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ ఈ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.  

ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో క‌మిన్స్ సార‌థ్యంలోని హైద‌రాబాద్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు హ‌డ‌లెత్తిపోయేలా బ్యాటింగ్ చేస్తోంది. ఇప్ప‌టికే ఆరెంజ్ టీమ్‌ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ప‌రుగుల రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను గురువారం ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ఆడ‌నుంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచులాడిన ఎస్ఆర్‌హెచ్ 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.
Pat Cummins
Star Sports
SRH
Cricket
Sports News
IPL 2024

More Telugu News