నాగర్ కర్నూల్ లోక్ సభ నుంచి ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్
- స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క
- రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించిన శిరీష
- గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిరీష
సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే కేవలం 5 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు నిలిచారు.