నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్... గెలుపే లక్ష్యంగా ముంబయి ఇండియన్స్

Mumbai won the toss and chose batting
ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లతో అగ్రశ్రేణి జట్టుగా పేరుపొందిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ లో పేలవంగా ఆడుతోంది. ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన ముంబయి 3 విజయాలు సాధించి, 4 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇవాళ ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొంటోంది. 

రాజస్థాన్ రాయల్స్ ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 7 మ్యాచ్ లు ఆడి కేవలం 1 మ్యాచ్ లోనే ఓడిన రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గాలంటే ముంబయి ఇండియన్స్ తీవ్రంగా చెమటోడ్చాల్సిందే. 

నేటి మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టు పలుమార్పులు చేసింది. నువాన్ తుషార, నేహాల్ వధేరా, పియూష్ చావ్లా జట్టులోకి వచ్చారు. రొమారియో షెపర్డ్, మధ్వాల్, శ్రేయాస్ గోపాల్ లను పక్కనబెట్టారు. అటు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో కుల్దీప్ సేన్ స్థానంలో సందీప్ శర్మ తుదిజట్టులోకి వచ్చాడు.
Go Back to Shorts
IPL 2024
Mumbai Indians
Rajasthan Royals
Jaipur

More Telugu News