14 ఏళ్ల రేప్ బాధితురాలి అబార్షన్ కు సుప్రీంకోర్టు అనుమతి
- బాంబే హైకోర్టు అనుమతి నిరాకరణతో సుప్రీంను ఆశ్రయించిన బాధితురాలి తల్లి
- గర్భాన్ని కొనసాగిస్తే బాలిక శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్న వైద్య నివేదిక
- దీంతో ఆమె అబార్షన్ కు అంగీకరించిన చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ ధర్మాసనం
తాజా విచారణ సందర్భంగా వైద్య నివేదికలో డాక్టర్లు పేర్కొన్న అంశాలను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. గర్భాన్ని కొనసాగిస్తే అది ఆ బాలిక శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నివేదికలో డాక్టర్లు అభిప్రాయపడ్డారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం బాలిక అబార్షన్ కు గ్రీన్ ఇగ్నల్ ఇచ్చింది.
అంతకుముందు ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. రేప్ బాధితురాలు ప్రస్తుతం 30 వారాల గర్భంతో ఉందని, ఆమె ముంబైలో నివసిస్తోందని చెప్పారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన మహిళలతోపాటు రేప్ బాధితులు, మైనర్లు, దివ్యాంగులు 24 వారాల్లోగా తమ గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకొనే వీలుంది.