Tillu Square: ఓటీటీలోకి వచ్చేస్తున్న టిల్లూ స్క్వేర్.. ఈ వారంలోనే స్ట్రీమింగ్

  • గోపీ చంద్ మూవీ భీమా సహా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు
  • నెట్ ఫ్లిక్స్ చందాదారులను అలరించనున్న టిల్లూ స్క్వేర్
  • హాట్ స్టార్ లో భీమా సినిమా స్ట్రీమింగ్
Tillu Square OTT Streaming date and details

డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలోనే టిల్లూ స్క్వేర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (ఈ నెల 26) నెట్ ఫ్లిక్స్ లో టిల్లూ స్క్వేర్ సినిమాను ఎంచక్కా ఇంట్లో కూర్చునే చూడొచ్చన్నమాట.. దీంతో పాటు గోపీచంద్ నటించిన భీమా సినిమా కూడా ఈ వారంలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఏయే కొత్త సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

ఏప్రిల్ 22: ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)
ఏప్రిల్ 25: దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్- అమెజాన్ ప్రైమ్), 
ఏప్రిల్ 27: వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)

నెట్‌ఫ్లిక్స్: 
ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)
ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)

ఏప్రిల్ 25: భీమా (తెలుగు - హాట్‌స్టార్)
ఏప్రిల్ 26: థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), క్రాక్ (హిందీ - హాట్‌స్టార్)

More Telugu News