Wines: హైదరాబాద్ మందుబాబులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్

Wines and bars in Hyderabad will be closed on Apr 23 on the occasion of Hanuman Jayanthi
  • రేపు హనుమాన్ జయంతి
  • నగరంలోని వైన్స్, బార్లు రేపు బంద్
  • శ్రీరామ నవమి సందర్భంగా కూడా మూతపడ్డ షాపులు
హైదరాబాద్ లోని మందుబాబులకు వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగిలింది. రేపు (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా బార్లు, మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. వారం తిరగక ముందే మరోసారి షాపులు బంద్ కానున్నాయి. రేపు వైన్ షాపులు మూతపడనున్న నేపథ్యంలో మందుబాబులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపటికి అవసరమైన మద్యాన్ని ఈరోజే కొనుగోలు చేస్తున్నారు.
Wines
Hyderabad
Bars
Bandh

More Telugu News