RCB: ఆర్సీబీ ఖాతాలో 7 ఓటములు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందా?

How can RCB qualify despite registering their 7th loss and this is IPL 2024 playoffs scenario
  • ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే!
  • అయితే అధికారికంగా ఇంకా నిష్క్రమించని బెంగళూరు
  • చివరి ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి 14 పాయింట్లు సాధించినా నో ఛాన్స్
  • రన్‌రేట్, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ఎండమావిలా కనిపిస్తున్న చిన్న అవకాశం

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. విజయాల కోసం ఆ జట్టు పోరాడుతూనే ఉంది. తాజాగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు రాణించినప్పటికీ చివరి రెండు పరుగులను రాబట్టలేక ఆ జట్టు బోల్తా కొట్టింది. దీంతో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఖాతాలో 7వ పరాజయం నమోదయింది.

కోల్‌కతా చేతిలో ఓటమితో ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ఉండవనే చెప్పాలి. అయితే అధికారికంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఇంకా నిష్ర్కమించలేదు. ఎందుకంటే మిగతా ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు చేతిలో 14 పాయింట్లు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఇతర జట్ల ఫలితాల ఆధారంగా టాప్-4 స్థానానికి 14 పాయింట్లు అర్హతగా ఉంటే ఆర్సీబీ పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమీకరణంలో నెట్ రన్ రేట్ చాలా కీలక పాత్ర పోషించనుంది. మెరుగైన జట్టుకే అవకాశం దక్కుతుంది.

అయితే ఐపీఎల్‌లో 10 జట్లు ఆడుతున్నప్పటి నుంచి ఒక జట్టు నాకౌట్ దశకు చేరుకోవడానికి 8 విజయాలు అవసరమవుతున్నాయి. 8 జట్లు ఉండడంతో 2018 నుంచి 2021 మధ్యకాలంలో నాలుగవ జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 12 పాయింట్లతో క్వాలిఫై అయింది. అయితే రెండు కొత్త జట్లు ప్రవేశపెట్టిన 2022 నాటి నుంచి ప్లే ఆఫ్స్‌ చేరాలంటే 16 పాయింట్లు అవసరమవుతున్నాయి.

ఈ సమీకరణం ప్రకారం చూస్తే ఆర్సీబీ మిగతా 6 మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉండదు. అయితే ఏమైనా అద్భుతాలు జరిగి ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు, మంచి రన్‌రేట్, ఇతర జట్ల ఓటములు కలిసి వస్తే తప్ప ఆర్సీబీ కథ ఇక ముగిసినట్టే.

  • Loading...

More Telugu News