USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

Two Telangana students killed road accident in USA
  • అరిజోనాలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదం
  • కారులో యూనివర్సిటీకి వస్తున్న కరీంన‌గర్, జనగామ జిల్లా విద్యార్థులు
  • వెనక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థుల మృతి
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన నివేశ్ (20), జనగామకు చెందిన గౌతమ్‌కుమార్ (19), అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి వీరు తమ స్నేహితులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. వెనక ఉన్న కారు వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో వెనక సీట్లో ఉన్న నివేశ్, గౌతమ్‌కుమార్ తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. కారులోని మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసులు భారత్‌లోని బాధిత కుటుంబాలకు ఘటన సమాచారం అందించారు. గౌతమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నివేశ్ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
USA
Road Accident
Telangana
Karimnagar District
Jangaon District

More Telugu News