Upasana: మామిడికాయ పచ్చడి కలిపిన సురేఖ... ఆసక్తికర వ్యాఖ్యలతో ఉపాసన వీడియో

Upasana shares funny video
  • అత్తమ్మాస్ కిచెన్ పేరుతో కొణిదెల సురేఖ ఆహార ఉత్పత్తుల వ్యాపారం
  • కొత్త ఆవకాయ పచ్చడి కలిపిన సురేఖ
  • అంజనాదేవి, సురేఖలతో ఉపాసన సరదా సంభాషణ
మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ ఇటీవల అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఆహార ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించారు. అందులో భాగంగా మామిడి కాయలతో కొత్త ఆవకాయ పచ్చడి కలిపారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

సురేఖ తన సిబ్బందితో మామిడికాయ పచ్చడి సిద్ధం చేస్తుండగా, చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అక్కడ కూర్చుని చూస్తున్నారు. వీడియో తీస్తున్న ఉపాసన... నాయనమ్మా... మీరు ఎందుకింత సీరియస్ గా ఉన్నారు? మీ కోడలు పచ్చళ్లు సరిగా చేయడం లేదా? అంటూ అంజనా దేవిని పలకరించారు. సీరియస్ ఏమీ లేదమ్మా... పని లేక అలా కూర్చున్నాను... నువ్వు ఉన్నావు కదా కోడలివి... వెళ్లి అత్తగారికి సహాయం చేయి అని మురిపెంగా అన్నారు. 

అనంతరం ఉపాసన తన అత్తగారు సురేఖ వద్దకు వెళ్లి "అత్తమ్మా" అనగానే... సురేఖ "ఏం" అంటూ చమత్కారంగా బదులిచ్చారు. "క్యా హోగా" అంటూ ఉపాసన హిందీలో అడగ్గా... "నాకు అసలు రాదు ఇంక" అంటూ సురేఖ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Upasana
Konda Surekha
Anjanadevi
Athammas Kitchen

More Telugu News