Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డి

Civils third ranker Ananya Reddy of Mahabubnagar met CM Revanth Reddy
  • అనన్యరెడ్డికి శాలువ కప్పి సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • సివిల్స్‌లో థర్డ్ ర్యాంక్ సాధించిన అనన్యరెడ్డి
సివిల్స్ థర్ట్ ర్యాంకర్ అనన్యరెడ్డి శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అరవై మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్‌కు చెందిన దోనూరి అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.
Revanth Reddy
IAS
Telangana
Congress

More Telugu News