Devineni Uma: మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానన్న జ‌గ‌న్‌కు నేడు ఓటు అడిగే హక్కు ఉందా?: దేవినేని ఉమా

  • రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధంపై జ‌గ‌న్ అబ‌ద్ద‌పు హామీలు ఇచ్చార‌ని మండిపాటు
  • సంపూర్ణ మద్యపాన నిషేధం అని మోసం చేసి అధికారంలోకి వచ్చారంటూ ధ్వ‌జం
  • జే-బ్రాండ్ నాసిరకం మద్యానికి పేదల ప్రాణాలు బలిచేశారని ఫైర్‌
  • పేదల జేబులు కొల్లగొట్టి సొంత ఖజానా నింపుకున్నారన్న టీడీపీ నేత‌
Devineni Uma Fire on AP CM Jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం విష‌యమై జ‌గ‌న్ అబద్ధపు హామీలు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్య‌బ‌ట్టారు. ఐదేళ్లుగా హామీని అటకెక్కించారంటూ ఫైర్ అయ్యారు. జే-బ్రాండ్ నాసిరకం మద్యానికి పేదల ప్రాణాలు బలిచేశారని విమ‌ర్శించారు. 

తయారీ నుండి అమ్మకం వరకు అంతా అస్మదీయులేన‌న్న దేవినేని.. నాణ్యమైన కంపెనీలపై నిషేధం అమలు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అంతులేని ధన దాహంతో పేదల జేబులు కొల్లగొట్టి సొంత ఖజానా నింపుకున్నారన్నారు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానన్న వైఎస్ జ‌గ‌న్‌కు నేడు ఓటు అడిగే హక్కు ఉందా? అని ప్ర‌శ్నించారు.

More Telugu News