5 వేలమంది ఉద్యోగులకు తోషిబా ఉద్వాసన.. ఇంతమంది ఉద్యోగుల తొలగింపు దేశంలోనే తొలిసారి!
- రీస్ట్రక్చరింగ్ పేరుతో ఉద్యోగుల తొలగింపు
- మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీపై దృష్టి
- ఏకమొత్తంగా 650 మిలియన్ డాలర్ల పెట్టుబడి
జపాన్‌లోనే అతిపెద్ద కంపెనీ అయిన తోషిబా ఇటీవలి కాలంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. దీనికితోడు మేనేజ్‌మెంట్ సమస్యలు, కుంభకోణాలు కూడా వేధిస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే జపాన్‌లో జాబ్ కోతలు చాలా తక్కువ. ఇప్పుడు తోషిబా తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది దేశంలోనే అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు కానుందని అంచనా వేస్తున్నారు.