Nara Lokesh: నా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్

Nara Lokesh thanked everyone who attended his nomination event
  • మంగళగిరిలో నేడు లోకేశ్ తరఫున నామినేషన్ వేసిన కూటమి నేతలు 
  • మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం అంటూ లోకేశ్ ట్వీట్
  • మంగళగిరిలో విజయంతో చరిత్ర లిఖిద్దాం అంటూ పిలుపు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తరఫున ఇవాళ మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.

"ఇవాళ మంగళగిరిలో నా తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన మంగళగిరి ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం. మనం చేయి చేయి కలిపి మంగళగిరిలో విజయంతో కొత్త చరిత్రను లిఖిద్దాం. దశాబ్దాల దుష్ట పాలన నుంచి మంగళగిరికి విముక్తి కల్పిద్దాం" అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
Nara Lokesh
Nomination
Mangalagiri
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News