MetaShot Smart Bat: ఇంట్లోనే క్రికెట్ ఆడేయొచ్చు.. ఏఆర్ క్రికెట్ బ్యాట్‌ను పరిచయం చేసిన ఫ్లిప్‌కార్ట్

Flipkart Introduces MetaShot Smart Bat For Cricket Fans
  • క్రికెట్ కన్సోల్ ‘మెటాషాట్’ను పరిచయం చేసిన ఫ్లిప్‌కార్ట్
  • గేమ్‌లో ఎంచక్కా మనమూ భాగమయ్యే అవకాశం
  • క్రికెట్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న ఫ్లిప్‌కార్ట్
ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ మరో ఆవిష్కరణతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. దేశంలోనే మొట్టమొదటి క్రికెట్ కన్సోల్ ‘మెటాషాట్’ని పరిచయం చేసింది. ఏఆర్ క్రికెట్ బ్యాట్ అయిన దీనిని పరిచయ ధరలో భాగంగా రూ. 5,499కే అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇండియాలోనే రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌బ్యాట్ వర్చువల్ గేమ్‌లో నిజమైన అనుభూతిని అందిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

గేమర్స్‌కు, మరీ ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని పేర్కొంది. కుటుంబంతో కలిసి ఇంట్లో క్రికెట్‌ను ఆస్వాదించే వారికి ఈ బ్యాట్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఈ బ్యాట్‌ను టీవీకి, మొబైల్‌కు పీసీకి కనెక్ట్ చేసుకుని ఎంచక్కా గేమ్‌లో భాగమై మనం కూడా సిక్సర్లు, ఫోర్లు కొట్టి ఎంజాయ్ చేయొచ్చు.
MetaShot Smart Bat
Filpkart
Online Market Place
Cricket Fans
Online Cricket Game

More Telugu News