Delhi Capitals: సొంతగడ్డపై గుజరాత్ కు ఘోర పరాభవం... ఘనంగా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals outplays Gujarat Titans by 6 wickets
  • ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఢిల్లీ
  • 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో ఊదిపారేసిన పంత్ సేన
శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ కు సొంతగడ్డపై 6 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదురైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పరమ చెత్తగా ఆడింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, పరుగులు సాధించేందుకు గుజరాత్ జట్టు ఆపసోపాలు పడింది. ఓవర్లన్నీ పూర్తికాక ముందే చేతులెత్తేసింది. 

అనంతరం, 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 4 వికెట్లు చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 పరుగులు చేయగా... అభిషేక్ పోరెల్ 15 (7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షాయ్ హోప్ 19 (1 ఫోర్, 2 సిక్సులు), కెప్టెన్ రిషబ్ పంత్ 16 (1 ఫోర్, 1 సిక్స్) పరుగులు చేశారు. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.
Delhi Capitals
Gujarat Titans
Ahmedabad
IPL

More Telugu News