BC: కోడికత్తి డ్రామాకి ఓ దళితుడ్ని బలి చేశారు... ఇప్పుడు మరో బీసీని బలి చేస్తున్నారు: పట్టాభి

Pattabhi fires on minor boys has taken into custody in stone attack case
  • సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి 
  • పోలీసుల అదుపులో వడ్డెర కులానికి చెందిన మైనర్ బాలురు?
  • బీసీలంటే అంత చులకనగా ఉందా అంటూ పట్టాభి ఫైర్ 
  • పర్యవసానాలు అనుభవిస్తారంటూ హెచ్చరిక 

సీఎం జగన్ పై రాయితో దాడి వ్యవహారంలో వడ్డెర సామాజికవర్గానికి చెందిన మైనర్లను బలిపశువులను చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. నాడు 2019లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడ్ని బలి చేశారని, ఇప్పుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"బలహీన వర్గాలకు చెందిన పిల్లలను మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? బీసీలంటే మీకు అంత చులకనగా ఉందా? రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వారిపై ఈ రకమైన దౌర్జన్యం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? కచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవిస్తారు" అంటూ పట్టాభి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News