కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి దుర్మరణం
- నెల్లూరు జిల్లాలో నెత్తురోడిన రహదారి
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
- కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి
- మృతులు జలదంకి మండలం చామదల గ్రామ వాసులుగా గుర్తింపు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రేపటి శ్రీరామ నవమి ఉత్సవ సామగ్రి కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.