Nara Lokesh: ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ...!: నారా లోకేశ్ సెటైర్లు

Nara Lokesh satires on CM
  • సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి
  • ఓ అనుమానితుడి అరెస్ట్!
  • ఇది క్వార్టర్ మేటర్ అంటూ లోకేశ్ ట్వీట్

సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సతీశ్ అనే యువకుడు సీఎం జగన్ పై రాయి విసిరినట్టుగా మీడియాలో ప్రసారమవుతోంది. క్వార్టర్ బాటిల్, రూ.350 డబ్బులు ఇస్తామని వైసీపీ నేతలు తనను సీఎం సభకు తీసుకువచ్చారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, డబ్బులు ఇవ్వలేదని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.  

సీఎం జగన్ నిన్న గుడివాడ సభలో మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా అంటూ తన ట్రేడ్ మార్క్ ప్రసంగం చేశారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేశారు. క్వార్టర్ మేటర్... ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా...! అంటూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News