TS Election Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కంగ్రెస్ దే హవా: న్యూస్ ఎక్స్ సర్వే

Congress wins majority seats in Telangana Lok Sabha elections says NewsX survey
  • 17 స్థానాల్లో కాంగ్రెస్ 8 సీట్లను గెలుచుకుంటుందన్న సర్వే
  • 5 స్థానాలను గెలుచుకోనున్న బీజేపీ
  • మూడో స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటబోతోందని న్యూస్ ఎక్స్ సర్వే తెలిపింది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని పేర్కొంది. తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ తన లక్ష్యాలకు అనుగుణంగానే 5 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కాబోతోందని చెప్పింది.

  • Loading...

More Telugu News