Basara IIIT: బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి సూసైడ్

Student commits suicide at IIIT Basara
  • పీయూసీ సెకండ్ ఇయర్ విద్యార్థి బలవన్మరణం
  • హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకున్న అర్వింద్
  • బాధిత విద్యార్థి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లి

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి కలకలం రేగింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఇటీవలి కాలంలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ) లో అర్వింద్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా బండారుపల్లికి చెందిన అర్వింద్.. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్నాడు. ఏంజరిగిందో ఏమో కానీ సోమవారం అర్వింద్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీ సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం కోసం అర్వింద్ మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News