Jagan: లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతాడు: జగన్

Nara Lokesh will give 6000 for vote says Jagan
  • లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలన్న జగన్
  • అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించుకోవాలని సూచన
  • అమ్మఒడి, చేయూత, నేతన్న హస్తం ఇచ్చే వారికే ఓటు వేయాలన్న సీఎం

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని... ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని... అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు. జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు వేయాలని సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందో ఆలోచించి వారికే ఓటు వేయాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News