Daggubati Purandeswari: దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు!... ఈసీ, ఏపీ సీఈవోకు పురందేశ్వరి లేఖ

Purandeswari wrote EC and AP CEO on election duties for endowment employees
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదన్న పురందేశ్వరి
  • భక్తులు ఇబ్బంది పడతారని వెల్లడి
దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తుండడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవోకు లేఖ రాశారు. దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఆలయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సిన దేవాదాయ సిబ్బంది ఎన్నికల విధులకు వెళితే భక్తులు ఇబ్బంది పడతారని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అనేక పండుగలు, ఉత్సవాలు ఉన్నాయని పురందేశ్వరి వెల్లడించారు. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేవాదాయ సిబ్బందికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.
Daggubati Purandeswari
EC
CEO
Endowment Employees
Election Duties
BJP
Andhra Pradesh

More Telugu News