Manchu Manoj: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మౌనిక

Manchu Manoj wife Mounika blessed with a baby girl
  • ఇన్ స్టా వేదికగా వెల్లడించిన లక్ష్మీ మంచు
  • మనోజ్ కు కూతురు పుట్టిందంటూ వెల్లడి
  • అభినందనలు తెలుపుతూ నెటిజన్ల కామెంట్లు

మంచు మనోజ్ భార్య మౌనిక తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ మంచు లక్ష్మీ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. మంచు ఫ్యామిలీలో మరో మెంబర్ వచ్చారంటూ ప్రకటించారు. ఇప్పటికే మనోజ్ కు ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు కూతురు పుట్టిందని పోస్ట్ చేశారు. మనోజ్ కొడుకు ధైరవ్ కు చెల్లెలు వచ్చిందని పేర్కొన్నారు. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు తెలిపిన మంచు లక్ష్మీ.. పాప ఫొటోను మాత్రం బయటపెట్టలేదు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మంచు మనోజ్ కు అభినందనలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, మంచు మనోజ్, భూమా మౌనికలకు గతంలో వేర్వేరు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న వీళ్లు.. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ తో మనోజ్ పంచుకున్నారు. సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.


  • Loading...

More Telugu News