IPL 2024: ల‌క్నోపై ఢిల్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలి జ‌ట్టుగా ఘ‌న‌త‌!

IPL History To Beat Lucknow Super Giants While Chasing 160 Plus Total
  • ఇంత‌వ‌ర‌కు 160కి పైగా ప‌రుగులు చేసిన ప్ర‌తిసారి గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
  • ఇప్ప‌టివ‌ర‌కు 160 ప్ల‌స్‌ స్కోర్‌ను కాపాడుకుని ఏకంగా 13 సార్లు విజయం సాధించిన వైనం
  • నిన్న‌టి మ్యాచులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో తొలిసారి ప‌రాజ‌యం
ల‌క్నో వేదిక‌గా శుక్ర‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మి చ‌విచూసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్నో నిర్దేశించిన‌ 168 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 18.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. అయితే, ఇంత‌వ‌ర‌కు 160కి పైగా ప‌రుగులు చేసిన ప్ర‌తిసారి ల‌క్నో ఆ స్కోర్‌ను కాపాడుకుంది. ఏ జ‌ట్టు కూడా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 160కి పైగా ప‌రుగుల టార్గెట్‌ను అందుకోలేక‌పోయాయి. 

ఇలా ఇప్ప‌టివ‌ర‌కు 160కి పైగా స్కోర్‌ను కాపాడుకుని ల‌క్నో 13 సార్లు గెల‌వ‌డం విశేషం. కానీ, నిన్న‌టి మ్యాచ్ లో ఢిల్లీ మొద‌టిసారి ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ల‌క్నోపై 160 ప్ల‌స్ టార్గెట్‌ను ఛేదించి విజ‌యం సాధించిన తొలి జ‌ట్టుగా డీసీ అవ‌త‌రించింది. ఇక ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఢిల్లీ ఆట‌గాడు జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గ‌ర్క్ అర్ధ శ‌త‌కం (55) తో అద‌రగొట్టాడు. అలాగే కెప్టెన్ రిష‌భ్ పంత్ (41), ఓపెన‌ర్ పృథ్వీ షా (32) కూడా రాణించడంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు విజ‌యం సులువైంది.   
IPL 2024
Lucknow Super Giants
Delhi Capitals
Cricket
Sports News

More Telugu News