TDP-JanaSena-BJP Alliance: మరో విడత ఉమ్మడిగా ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్... షెడ్యూల్ ఖరారు

Chandrababu and Pawan Kalyan will campaign jointly again
  • గత రెండ్రోజులుగా ఉమ్మడి సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్
  • ఈ నెల 16, 17 తేదీల్లోనూ జంటగా ప్రచారం
  • ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా చంద్రబాబు బిజీ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గత రెండ్రోజులుగా ఉమ్మడి ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తణుకు, నిడదవోలు, పి.గన్నవరం, అమలాపురంలో వీరిద్దరూ పాల్గొన్న సభలకు విశేష స్పందన లభించింది. అదే ఉత్సాహంతో మరో విడత ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. 

ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురు కలిసి ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ రోడ్ షోల్లో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు. ఏప్రిల్ 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. 

కాగా, చంద్రబాబు నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపట్టనున్నారు. రేపు తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం కొనసాగిస్తారు. ఎల్లుండి (ఏప్రిల్ 14) పాయకరావుపేట, చోడవరం, గాజువాక... ఏప్రిల్ 15న రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం సభలకు హాజరవుతారు. 

మరోవైపు పవన్ కల్యాణ్ ఏప్రిల్ 16 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో ప్రచారం సాగించే అవకాశాలున్నాయి.
TDP-JanaSena-BJP Alliance
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News