Nara Lokesh: తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైకి మద్దతుగా నేడు, రేపు నారా లోకేశ్ ప్రచారం

TDP leader Nara Lokesh to be canvassing for Tamil Nadu BJP chief Annamalai Kuppusamy
  • కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి అన్నామలై
  • నేడు, రేపు కోయంబత్తూరులో లోకేశ్ పర్యటన
  • నేటి రాత్రి ఏడు గంటలకు పీలమేడులో సభ
  • రేపు తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు, రేపు ప్రచారం చేయనున్నారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అక్కడ తెలుగువారు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు లోకేశ్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఆయన నేడు, రేపు కోయంబత్తూరులో పర్యటించి సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటారు. నేటి రాత్రి ఏడు గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగిస్తారు. రేపు ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు.
Nara Lokesh
Tamil Nadu
Annamalai Kuppusamy
BJP
Telugudesam
Coimbatore

More Telugu News