Mohammed Iqbal: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

YCP MLC Mohammed Iqbal joins TDP
  • వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
  • సొంతగూటికి చేరిన మహ్మద్ ఇక్బాల్
  • మహ్మద్ ఇక్బాల్ కు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు
ఏపీ అధికార పక్షం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ఆయనకు టీడీపీలోకి స్వాగతం పలికారు. 

మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. 

మహ్మద్ ఇక్బాల్ హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ ను తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూడు టీడీపీకి తిరిగొచ్చారు.
Mohammed Iqbal
TDP
Chandrababu
MLC
YSRCP
Hindupur

More Telugu News