Venu Swamy: విజయ్ దేవరకొండ సినిమా నాశనం కావడానికి కారణం ఇదే: వేణు స్వామి

Venu Swamy on failure of Vijay Devarakonda film failure
  • ప్రేక్షకులను ఆకట్టుకోని విజయ్ తాజా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'
  • సినిమా ఫ్లాప్ కావడానికి నెగెటివ్ పబ్లిసిటీనే కారణమన్న వేణు స్వామి
  • 'గుంటూరు కారం' సినిమా పోవడానికి కూడా ఇదే కారణమని వ్యాఖ్య

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి. టాలీవుడ్ లో పలువురు ఆయనను కలుస్తుంటారు. దీంతో ఆయన బాగా పాప్యులర్ అయ్యారు. సినీ స్టార్ల జీవితాలలో ఏం జరగబోతోందనే విషయాలపై ఆయన జాతకాలు చెపుతుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ కావడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగెటివ్ పబ్లిసిటీ కారణంగానే మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా ఫెయిల్యూర్ అయిందని... ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని అన్నారు. 

విజయ్ దేవరకొండ సినిమా ఒక బేకార్ సినిమా అని, దాన్ని చూడాల్సిన అవసరం లేదని నెగెటివ్ రివ్యూస్ వచ్చాయని వేణు స్వామి చెప్పారు. ఈ సినిమా నాశనం కావడానికి ఇదే కారణమని తెలిపారు. సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ కావడానికి ముందు నుంచే నెగెటివ్ ప్రచారం జరిగిందని చెప్పారు. ఈ సినిమా విషయంలో విజయ్ కు పెద్ద నష్టమే జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News