Sujana Chowdary: ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తోంది: సుజనా చౌదరి

I am getting good response from voters says Sujana Chowdary
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి
  • ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం ఉందని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్న సుజనా
  రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గం ప్రజల కోసం తాను కష్టపడి పని చేస్తానని చెప్పారు. ప్రజల నుంచి తనకు మంచి ప్రతిస్పందన వస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

తన దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందని అన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నెట్ వర్క్ కి సంబంధించి తనకు అవగాహన ఉందని ... ఆ పరిజ్ఞానాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.
Sujana Chowdary
BJP

More Telugu News