Ugadi 2024: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్ష‌లు

CM YS Jagan Wishes to AP People on Ugadi 2024
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇలా తెలుగువారి కొత్త సంవ‌త్స‌రాన్ని పుర‌ష్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ముఖ్యమంత్రి విషెస్ తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్నీ మంచి జ‌ర‌గాల‌ని, విజ‌యాలు చేకూరాల‌ని జ‌గ‌న్ ఆకాంక్షించారు. అలాగే ఈ క్రోధి నామ సంవ‌త్స‌రంలో బాగా వర్షాలు కుర‌వాల‌ని, పంట‌లు బాగా పండి అన్న‌దాత‌లు ఆనందంగా ఉండాల‌ని కోరారు. ఈ కొత్త ఏడాదిలో రాష్ట్రంలోని అంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షించడం జ‌రిగింది. 

"రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Ugadi 2024
YS Jagan
Andhra Pradesh

More Telugu News