Eatala Rajendar: కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమేనా?: ఈటల

  • మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమం
  • తెలంగాణలో 17 సీట్లు గెలిచినా దేశంలో కాంగ్రెస్ కు 60కి మించి స్థానాలు రావని ఎద్దేవా
  • కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగని పని అని స్పష్టీకరణ 
Eatala Rajendar slams Congress party on poll assurances

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగని పని అని స్పష్టం చేశారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలిచినా దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య 60 కూడా దాటదని ఎద్దేవా చేశారు. 

కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోందని విమర్శించారు. 

అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు... ఆ హామీ ఏమైంది? మహిళలకు రూ.2,500 ఇస్తామన్నారు... ఆ హామీ ఏమైంది? రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలు చేస్తామన్నారు... ఆ హామీ ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తారా? అంటూ రేవంత్ సర్కారుపై ఈటల ధ్వజమెత్తారు.

More Telugu News