Nara Lokesh: నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ యవ్వారం: నారా లోకేశ్

Nara Lokesh slams CM Jagan again
  • నందికొట్కూరులో ముస్లిం మహిళ పట్ల అసభ్యప్రవర్తన
  • వైసీపీ నేతపై మీడియాలో కథనం
  • ఘాటుగా స్పందించిన నారా లోకేశ్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ ముస్లిం మహిళ పట్ల వైసీపీ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించినట్టు మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. నా... నా... అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ గారి యవ్వారం అంటూ లోకేశ్ విమర్శించారు. 

"నా ఎస్సీలు,  నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ  జగన్ బహిరంగ సభల్లో ప్రేమ కురిపిస్తుంటే... క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ మూకలు ప్రతి రోజూ ఆయా వర్గాలపై దాడులకు తెగబడుతూ, అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. 

పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బీసీ యువకుడ్ని హత్య చేసి 24 గంటలు కూడా గడవకముందే... తాజాగా నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి నమాజ్ కు వెళ్లివస్తున్న ముస్లిం మహిళను బురఖా తొలగించి తీవ్రంగా అవమానించాడు. అదేమని ప్రశ్నించిన ఆమె భర్త, కుమారుడిపై శ్రీనివాసరెడ్డి చెప్పుతో దాడికి తెగబడ్డాడు.

అధికారమదంతో విర్రవీగుతున్న జగన్ అండ్ కో కు మరో 37 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలిసి ఘోరీ కట్టడం ఖాయం" అని నారా లోకేశ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News