కాంగ్రెస్‌కు కీలక నేత గౌరవ్ వల్లభ్ రాజీనామా.. సనాతనధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేనని లేఖ
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు గౌరవ్ వల్లభ్ రాజీనామా లేఖ
- దిశానిర్దేశం లేని పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్య
- దేశంలో సంపద సృష్టికర్తల్ని విమర్శించలేనంటూ లేఖ
గౌరవ్ వల్లభ్ గతంలో ఖర్గే అధ్యక్ష ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 2019లో ఝార్ఖండ్‌లోని తూర్పు జంషెడ్‌పూర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన 18 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.