David Warner: హ‌నుమంతుడి ఫొటో షేర్ చేసిన డేవిడ్ వార్న‌ర్‌

David Warner Shares Photo of Hanuman Ji Idol During His Visit to Vizag Ahead of DC vs KKR IPL 2024
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హ‌నుమంతుడి విగ్ర‌హం తాలూకు ఫొటో పంచుకున్న డీసీ స్టార్ ఓపెన‌ర్‌
  • వైజాగ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా తీసిన ఫొటో అని వార్న‌ర్ వెల్ల‌డి
  • నేడు విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా కేకేఆర్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హ‌నుమంతుడి విగ్ర‌హం తాలూకు ఫొటోను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) మ్యాచు కోసం డీసీ జ‌ట్టు విశాఖ‌ప‌ట్ట‌ణంలోనే ఉంది. దాంతో డేవిడ్ వార్న‌ర్ వైజాగ్‌లో ప‌ర్య‌టించాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఒకచోట క‌నిపించిన హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని త‌న కెమెరాలో బంధించాడు. అనంత‌రం ఆ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో అభిమానుల‌తో పంచుకున్నాడు. 'ఇవాళ నేను వైజాగ్‌లో డ్రైవ్‌కి వెళ్లాను. జైహ‌నుమాన్' అంటూ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇప్పుడీ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. ఢిల్లీ జ‌ట్టు ఇవాళ వైజాగ్ వేదిక‌గా కోల్‌క‌తాతో త‌ల‌ప‌డ‌నుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని డీసీ త‌న రెండో హోం గ్రౌండ్‌గా వాడుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వేదిక‌పై డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను రిష‌భ్ పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ మ‌ట్టిక‌రింపించింది. ఈ మ్యాచ్‌లో రిష‌భ్‌తో పాటు డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. దీంతో కేకేఆర్ మ్యాచులోనూ డీసీ విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.
David Warner
Vizag
Hanuman
IPL 2020
DC
KKR
Sports News
Cricket

More Telugu News