Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం.. హైదరాబాద్ కు పయనం

Pawan Kalyan election campaign stopped due to fever
  • పిఠాపురంలో మండుటెండలో ప్రచారం చేసిన పవన్
  • ఎండ వేడి కారణంగా అస్వస్థతకు గురైన వైనం
  • ఈరోజు తెనాలి, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటనలు వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురికావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన... చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది.
Pawan Kalyan
Janasena
Fever
AP Politics

More Telugu News