Celebrity Billionaires 2024: ఫోర్బ్స్ సెలబ్రిటీ బిలియనీర్లు 2024 వార్షిక‌ జాబితా వ‌చ్చేసింది!

World Celebrity Billionaires 2024 Forbes List
  • జాబితాలో 'స్టార్ వార్స్' ద‌ర్శ‌కుడు జార్జ్ లుకాస్‌కు మొద‌టి స్థానం
  • రెండో స్థానంలో నిలిచిన స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్
  • మూడో స్థానంలో బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ మైఖేల్ జోర్డాన్ 
  • మొదటి నల్లజాతి మహిళా బిలియనీర్‌గా ఓప్రా విన్‌ఫ్రే

ఫోర్బ్స్ వార్షిక జాబితా 2024కి సంబంధించిన‌ సెలబ్రిటీ బిలియనీర్ల తాజా జాబితా విడుద‌లైంది. ఈ జాబితాలో 5.5 బిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో 'స్టార్ వార్స్' ద‌ర్శ‌కుడు జార్జ్ లుకాస్ మొద‌టి స్థానం ద‌క్కించుకున్నారు. ఆయ‌న త‌ర్వాత రెండో స్థానంలో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ (4.8 బిలియ‌న్ డాల‌ర్లు) నిలిచారు. ఇక మూడో స్థానంలో బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ మైఖేల్ జోర్డాన్ ఉన్నారు. ఇటీవ‌ల నైక్ సంస్థ‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆయ‌న‌కు భారీ ఆదాయం స‌మ‌కూరింది. అలాగే ప్రముఖ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, మొదటి నల్లజాతి మహిళా బిలియనీర్‌గా అవతరించారు. ఈమె 2.8 బిలియన్ డాల‌ర్ల సంపాద‌న‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. 

కాగా, రాపర్ జే-జెడ్ ఎవ‌రూ ఊహించిన విధంగా టాప్-5 సెలబ్రిటీ బిలియనీర్ల జాబితాలో స్థానాన్ని పొందారు. ఆయ‌న నెట్‌వ‌ర్త్ 2.5 బిలియన్ డాల‌ర్లు. ఇక త‌న వ్యాపారాల‌ నుండి భారీగా ఆదాయం ఆర్జించిన‌ కిమ్ కర్దాషియాన్ 1.7 బిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో ఆరో స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. ప్ర‌ముఖ పాప్ సింగర్ రిహన్న 1.4 బిలియన్ డాల‌ర్ల నెట్‌వ‌ర్త్‌తో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. అలాగే మ‌రో బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ 1.2 బిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో 11వ స్థానంలో వున్నారు. "లవర్" గాయని టేలర్ స్విఫ్ట్ 1.1 బిలియన్ల నెట్‌వ‌ర్త్‌తో 14వ స్థానాన్ని పొందారు.

  • Loading...

More Telugu News